ఖమ్మం లీగల్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే కాక పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. జిల్లా జడ్జిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆయన పరిచయ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఖమ్మం కోర్టు, బార్ అసోసియేషన్ ప్రత్యేకత కలిగి ఉండగా, ఈ అసోసియేషన్‌లో వేయి మందికి పైగా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. ఈమేరకు ఖమ్మం న్యాయస్థానాన్ని అన్ని అంశాల్లో అగ్రభాగాన నిలపడానికి కృషి చేస్తానని వెల్లడించారు. న్యాయమూర్తులు కృష్ణార్జున్, సీనయ్య, మహేష్‌నాథ్, కల్పన, శివరంజని, మురళీమోహన్, దేవీమానస, జ్యోతిర్మయి, రజిని, బిందుప్రియ, నాగలక్ష్మి, ప్రవీణ్‌తో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్, కొప్పుల రవి, బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, మందడపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు జానీమియా, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా నూతన జడ్జి నాగరాజు


