ఖమ్మంవ్యవసాయం: జిల్లావ్యాప్తంగా సహకార వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పీఏసీఎస్‌ల్లో పతాకాన్ని ఆవిష్కరించి సహకార వ్యవస్థ ప్రత్యేకతలను వివరించారు. కాగా, ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో జనరల్ మేనేజర్ వి. వసంతరావు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బ్యాంకు అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఏ పద్మావతి, డీజీఎంలు జి.ఉదయశ్రీ, జి.వేణుగోపాల్, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు.


