సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్‌తో సోమవారం సీపీఎం ఆధ్వర్యాన సత్తుపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈమేరకు సీఐ టి.శ్రీహరి ఆధ్వర్యాన పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసనకు యత్నిస్తే పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు మాచర్ల భారతి, శీలం సత్యనారాయణరెడ్డి, చలమాల విఠల్, జాజిరి శ్రీను, జ్యోతి, పాండు, వేలాద్రి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
అరెస్టులు సరికాదు
ఖమ్మంమయూరిసెంటర్: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తే నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు మద్దతుగా వెళ్లిన తమ పార్టీ నాయకులు పలువురితో పాటు ఇంకొందరిని ఇళ్ల వద్దే అరెస్ట్ చేశారని తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
ముట్టడికి యత్నం


