జగదభిరాముడికి జ్యేష్ఠ్యాభిషేకం | - | Sakshi
Sakshi News home page

జగదభిరాముడికి జ్యేష్ఠ్యాభిషేకం

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

ఏరువాక పౌర్ణమి సందర్భంగా

ప్రత్యేక పూజలు

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జ్యేష్ట మాస పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం జగదభి రాముడికి జ్టేష్టాభి షేకం కనుల పండుగా జరిపారు. తొలుత బేడా మండపంలో ఏర్పాటు చేసిన 81 కలశాలలో సమస్త నదీ జలాలను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం, నదీజలాలతో జ్యే ష్ఠ్యాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారికి హారతి సమర్పించారు. కాగా జ్యేష్ఠ్యాభిషేకాన్ని పురస్కరించుకుని సోమవారం రద్దు నిత్యకల్యాణం రద్దు చేయగా, మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగించనున్నారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్‌, కోటి రామస్వరూప్‌, ఇతర అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement