మాజీ ఎమ్మెల్యేకు పలువురి నివాళి | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యేకు పలువురి నివాళి

Jun 29 2026 12:17 AM | Updated on Jun 29 2026 12:17 AM

పెనుబల్లి: ఇల్లెందు మాజీ ఎమ్మె ల్యే వంగా సుబ్బారావు మృతి బాధాకరమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి అన్నా రు. పెనుబల్లి మండలం ముత్యాలబంజరలోని స్వగ్రామంలో సుబ్బారావు శనివారం మృతి చెందగా, ఆయన మృతదేహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించాక ఆమె మాట్లాడుతూ సుబ్బారావు ఎమ్మెల్యేగా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆమె వెంట వీఎం బంజర సర్పంచ్‌ భూక్యా ప్రసాద్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, నాయకులు మిట్టపల్లి కిరణ్‌కుమార్‌, మేకతోటి కాంతయ్య, వంగా నిరంజన్‌గౌడ్‌, గోగినేని రమేశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement