రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి

Jun 29 2026 12:17 AM | Updated on Jun 29 2026 12:17 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలుచేస్తోందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30న చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఈ వేదిక పైనుంచి దాదాపు రూ.9 వేల కోట్ల నిధులను రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారని తెలిపారు. ఈ సభకు రైతులు, జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి మాట్లాడుతూ.. సీఎం సభకు వచ్చే రైతులకు ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఖాదర్‌బాబా, నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, కమర్తపు మురళి, దొబ్బల సౌజన్య, మొక్క శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి

భారతరత్న, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని ఆదివారం కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న పీవీ విగ్రహాలకు నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తా సీతారాములు, రాష్ట్ర ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు వడ్డేబోయిన నరసింహారావు తదితరులు పీవీ చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయ సేవలను కొనియాడారు.

విలేకరుల సమావేశంలో

కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement