ఆరేళ్ల చిన్నారికి నరాల వ్యాధి | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారికి నరాల వ్యాధి

Jun 29 2026 12:17 AM | Updated on Jun 29 2026 12:17 AM

రఘునాథపాలెం: అందరితో పాటే ఆడుతూ, పాడుతూ పాఠశాలకు వెళ్లి రావాల్సిన చిన్నారిపై విధి పగపట్టింది. దీంతో మంచానికే పరిమితమైన ఆమెకు ఉన్నదంతా ఊడ్చి చికిత్స చేయించినా ఫలితం లేక దాతల చేయూత కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఆరేళ్ల నవ్య జ్యోత్స్న నరాల సంబంధిత వ్యాధి బారిన పడింది. అప్పటి నుంచి ఆస్పత్రులకు వెళ్తూ పరీక్షలు, చికిత్స చేయిస్తుండగా వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్సకు పెద్దమొత్తంలో నగదు అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నవ్య తల్లిదండ్రులు వెనిగళ్ల రామకృష్ణ – రాజేశ్వరి ఆవేదనకు గురయ్యారు. ఎలాంటి ఆస్తులు లేకపోగా, ఇద్దరు కుమార్తెలను పోషించడమే కష్టమైన తరుణంలో ఇప్పుడు నవ్య పరిస్థితి వారికి ఆందోళన కలిగిస్తోంది. ఉన్న కొద్దోగొప్పో నగదు ఖర్చు అయిపోవడంతో దాతలు అండగా నిలిచి తమ కుమార్తెకు జీవితాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.

చికిత్సకు చేయూత ఇవ్వాలని

తల్లిదండ్రుల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement