ఖమ్మంమయూరిసెంటర్: ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలోకి మారిన సంస్కృతి పువ్వాడ అజయ్‌కుమార్‌తోనే మొదలైందని, ఇప్పుడు ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును విమర్శించడం గర్హనీయమని కాంగ్రెస్ ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి అన్నారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం తప్పించే మంత్రి తుమ్మల నిజాయితీని చూసి పార్టీలే చేర్చుకున్నాయని తెలిపారు. నాయకులు మందడపు మనోహర్, ఏలూరి శ్రీనివాసరావు, బాణాల లక్ష్మణ్, కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
తుమ్మలపై విమర్శలు గర్హనీయం..
ఖమ్మంఅర్బన్: అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న రాష్ట్ర శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు చేసిన విమర్శలు గర్హనీయమని నాయకులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం మార్కెట్, ఆత్మకమిటీ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. నాయకులు వాంకుడోత్ దీప్లానాయక్, తాతా రఘురాం, ధరావత్ రామ్మూర్తి, రాము, చెరుకూరి పూర్ణ, కొంటెముక్కల నాగేశ్వరరావు, సుధీర్, శ్రీను, వెంకటరమణ, బండి వెంకన్న, శంకర్, కాసిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.


