ఖమ్మంక్రైం: నగరంలోని నూతన బస్టాండ్‌లో ఆదివారం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గంజాయిని పట్టుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రాం భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన రాకేశ్‌జైన్ వద్ద సంచిలో 9 కేజీల గంజాయి లభ్యమైంది. అతడిని అదుపులోకి తీసుకుని, గంజాయి సీజ్ చేశారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ శ్రీహరిరావు, సిబ్బంది కరీం, వెంకట్, హరీశ్, విజయ్, హనుమంతరావు, వీరబాబు పాల్గొన్నారు. గంజాయి సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252523కు ఫోన్ చేయాలని అధికారులు కోరారు.
రెండు ఆలయాల్లో
చోరీ
కల్లూరురూరల్: మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలోని శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల్లోని హుండీలను పగలగొట్టిన దుండగులు అందులోని నగదు చోరీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఘటన జరగగా ఆదివారం ఉదయం భక్తులు ఆలయాలకు వెళ్లగా హుండీలు పగలగొట్టి ఉండటం గమనించి గ్రామస్తులకు తెలిపారు. వారు కల్లూరు పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి రెండు హుండీలను పరిశీలించారు. ఒకే వ్యక్తి హుండీలు పగలగొట్టి డబ్బులు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. శివాలయం హుండీలో సుమారు రూ.40 వేలు, వేణుగోపాలస్వామి ఆలయంలోని హుండీలో సుమారు రూ.15 వేలు చోరీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


