ఇరాన్‌పై దురాక్రమణ దాడిని ఖండించండి | - | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై దురాక్రమణ దాడిని ఖండించండి

Mar 10 2026 12:48 PM | Updated on Mar 10 2026 12:48 PM

తిరుమలాయపాలెం: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దురాక్రమణ దాడిని ఖండించడమే కాక ఇజ్రాయెల్‌, అమెరికాతో భారత్‌ దౌత్య, వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. విప్లవోద్యమ నేత రాయల సుభాష్‌ చంద్రబోస్‌ పదో వర్ధంతి, రాయల నాగేశ్వరరావు మూడో వర్ధంతి సందర్భంగా మండలంలోని పిండిప్రోలులో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఆయిల్స్‌పై ఆధిపత్యం కోసమే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దురాక్రమణ దాడులకు దిగుతుండడం అన్యాయమైన చర్య అని దుయ్యబట్టారు. ఇటీవల వెనుజువెలా ఘటన, ఇప్పుడు ఇరాన్‌పై దాడులను పరిశీలిస్తే ప్రపంచ ఆధిపత్య ధోరణి విధానంలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఈమేరకు వెంటనే యుద్ధం ఆపేలా అంతర్జాతీయ సంస్థలు జ్యోకం చేసుకోవాలని.. అమెరికా, ఇజ్రాయిల్‌తో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను కేంద్రం రద్దు చేసుకోవాలని రంగారావు డిమాండ్‌ చేశారు. కాగా, రవన్న, రాయల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవన్న ట్రస్ట్‌ చైర్మన్‌ గుర్రం అచ్చయ్య, పార్టీ నాయకులు బందెల వెంకయ్య. కమ్మ కోమటి నాగేశ్వరరావు. దొండేటి రామయ్య. రేపాకుల శివలింగం, తిమ్మిడి హన్మంతరావు, రాయల విమల, శ్రీధర్‌, సోమనపల్లి వెంకటేశ్వర్లు, పుసులూరి పుల్ల య్య, ఎడ్లపల్లి నవీన్‌. సరోజన, వెంకటస్వామి, రాయల రాజా తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement