కల్లూరురూరల్: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈనెల 11న కేంద్ర జలశక్తి మిషన్ ఆధ్వర్యాన జరగనున్న జాతీయ స్థాయి సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననుండగా.. తెలంగాణ నుంచి 12 మందికి ఆహ్వానం అందింది. ఇందులో జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వాటర్ సప్లై ఆపరేటర్లు, మిషన్ భగీరథ అధికారులు ముగ్గురు చొప్పున సమావేశంలో పాల్గొననున్నారు. సర్పంచ్‌ల్లో కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన బూదాటి గీత, మిషన్ భగీరథ అధికారుల్లో ఖమ్మం ఈఈ డి.పుష్పలత, వాటర్ సప్లై ఆపరేటర్లలో చింతగుర్తికి చెందిన పెంట్యాల కళావతికి ఆహ్వానం అందింది.


