మనసులో వేదనను భరిస్తూ, భవిష్యత్‌పై బెంగతో ఆందోళనలో పాల్గొన్న వారు ఆకలి బాధకు విలవిల్లాడిపోయారు. వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిలువ నీడ కోల్పోయిన వారు.. ఎమ్మెల్సీ కవిత, ఇతర సంఘాల నాయకులతో కలిసి ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ధర్నాకు దిగారు. మూడు గంటల పాటు మండుటెండలో ఈ ధర్నా కొనసాగింది. మధ్యాహ్న భోజన సమయం కావడంతో అక్కడికే భోజనాలు తెప్పించగా ఓ పక్క ఆందోళన కొనసాగిస్తూనే ఆకలి తీర్చుకున్నారు. ఇక మహిళలతో ఉన్న పిల్లలకు భోజనం చేయిస్తూ నీళ్లు తాగిస్తున్న దృశ్యాలు చూసిన పలువురి కళ్లు చెమర్చాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


