జిల్లా కోర్టులో గణతంత్రం
ఖమ్మం లీగల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టులో జాతీయ పతాకాన్ని ఇన్‌చారి్‌జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ఉమాదేవి ఆవిష్కరించారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన న్యాయవాదులకు బహుమతులు అందజేశారు. న్యాయమూర్తులు అర్చనకుమారి, రాంప్రసాదరావు, సీనయ్య, శివరంజని, దీప, రజని, అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావుతో పాటు విజయశాంత, దిలీప్, ఇందిర, కొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, మానే రు లా కాలేజీలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన రేష్మ, సాయి కేశవ్‌కు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఉమాదేవి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఖమ్మంవ్యవసాయం/ఖమ్మం సహకారనగర్: గణతంత్ర వేడుకల సందదర్భంగా డీసీసీబీలో కలెక్టర్, బ్యాంకు ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, క్యాంపు కార్యాలయంలో కూడా కలెక్టర్ అనుదీప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. డీఆర్వో పద్మ శ్రీ, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే, జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లో అదనపు కలెక్టర్, సంస్థ పర్సన్ ఇన్‌చార్జి పి.శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులుగా ఎంపికై న పి.గోపి, బి.హిమబిందు తదితరులకు ప్రశాంసాపత్రాలు అందించారు. సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టులో గణతంత్రం
జిల్లా కోర్టులో గణతంత్రం


