సైనిక సంక్షేమ నిధికి ‘సెడార్ వ్యాలీ’ రూ.2లక్షల విరాళం
రఘునాథపాలెం: మండలంలోని వీవీ.పాలెంలోని సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. సాయంత్రం జరిగిన ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెహతా, క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ వై.నాగమణి, సెడార్ వ్యాలీ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ రవి మారుత్, డైరెక్టర్ ఆర్.పార్వతిరెడ్డి, అడ్వైజర్ ఉదయ తదితరులు పాల్గొనగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు వివిధ దేశాలకు చెందిన ఆహార పదార్థాలతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుచేయడంతో సమకూరిన రూ.2.10లక్షలను సైనిక సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వడంపై కలెక్టర్ అభినందించారు.


