గణతంత్ర పరేడ్‌లో జిల్లా విద్యార్థిని
కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని పాయం దుర్గ హైదరాబాద్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌కు హాజరైంది. ఎన్‌సీసీ శిక్షణ పొందుతున్న ఆమె పరేడ్‌లో పాల్గొనడమే కాక బహుమతి గెలుచుకుంది.
వీవీ.పాలెం సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం పీఏసీఎస్ ద్వారా డిజిటల్ సేవలు సమర్థవంతంగా అమలుచేస్తుండడంతో పాటు కేంద్రం పథకాల అమలులో ముందంజలో ఉన్న నేపథ్యాన కేంద్రప్రభుత్వ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ‘సహకార సమృద్ధి – వికసిత్ భారత్’ సదస్సులో పీఏసీఎస్ సీఈఓ ఐతగాని తిరుపతిరావుకు కేంద్ర సహకార శాఖ మంత్రి మురళీధర్ మోహన్ జ్ఞాపిక అందజేసి అభినందించారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సహకార సంఘాలు, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలక భూమిక వహించాలని సూచించారు.
గణతంత్ర పరేడ్‌లో జిల్లా విద్యార్థిని


