పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం
నేలకొండపల్లి: మండలంలోని కట్టుకాచారం ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి పలువురు దాతలు ముందుకొచ్చారు. పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమావేశంలో కొఠారు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్ధం ఆయన మనవడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ రూ.5లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాక ఏటా అన్ని తరగతుల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు బహుమతులు ఇస్తామని తెలిపారు. అంతేకాక ఉప సర్పంచ్ నెల్లూరి మోహన్‌రావు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ అందించగా, ఏటుకూరి చిన్న పుల్లయ్య మధ్యాహ్నం భోజనం తయారికి గ్యాస్ స్టౌ సమకూర్చారు. ఇంకా గోపాలమిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బోయపాటి నారాయణరావు, రిటైర్ట్ ఉపాధ్యాయురాలు సునందదేవీ కూడా విరాళాలు ప్రకటించారు. అనంతరం దాతలను హెచ్‌ఎం రాందాసు ఆధ్వర్యాన సన్మానించారు. సర్పంచ్ బాణావత్ సైదులుతో పాటు కోటి శ్రీనివాసరావు, బోయపాటి రాంబాబు, పుల్లయ్య, ఇటిక్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.


