సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న జిల్లాకు రానున్న నేపథ్యాన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి శుక్రవారం ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ సీఎం పర్య టన నేపథ్యాన బందోబస్తు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్ ఏర్పాటుపై సూచనలు చేశారు. విధుల్లో పాల్గొనే అధికారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, శాఖల వారీగా అభివృద్ధిపై నివేదికలు సిద్దం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
1,800 మంది పోలీసులతో బందోబస్తు
ఖమ్మంక్రైం: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా 1,800 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. బందోబస్తులో ఖమ్మంతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొన్నారు. అంతేకాక స్పెషల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్, రోప్ పార్టీ, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు ఉంటాయని తెలిపారు.
ప్రారంభానికి
ఏర్పాట్లు చేయండి
మధిర: మధిరలో నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 19న ప్రారంభించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆస్పత్రిని పరిశీలించిన ఆయన వసతుల కల్పనపై ఆరా తీశారు. అలాగే, ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
గోశాలలో
మిస్టర్ వరల్డ్ రోహిత్
ఖమ్మంఅర్బన్: మిస్టర్ ఇండియా–2015, మిస్టర్ వరల్డ్–2016 విజేత రోహిత్ ఖండేల్‌వాల్ ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీకృష్ణ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గోశాలలో పూజలు చేసి గోవులకు దాణా తినిపించగా.. గోసంరక్షణ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారని గోశాల బాధ్యుడు కేసా హనుమంతురావు తెలిపారు. 2015లో మిస్టర్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన రోహిత్, 2016 మిస్టర్ వరల్డ్ పోటీల్లోనూ టైటిల్ కైవసం చేసుకున్న తొలి ఆసియా వాసిగా చరిత్ర సృష్టించారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు


