పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో రెండు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం పంచామృతాభిషేకం జరిపారు. తొలుత అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతం అభిషేకపూజలు, పంచహారతులు, నీవేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
షార్ట్‌సర్క్యూట్‌తో షాపు దగ్ధం
బోనకల్: మండలంలోని జానికీపురంలో శుక్రవారం టీవీలు రిపేర్ చేసే షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. గ్రామానికి చెందిన వెంకటనారాయణ షాపులో మధ్యాహ్నం సమయాన మీటర్ వద్ద మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మధిర అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహంనతో చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటికే షాపులో రూ.లక్ష విలువైన సామగ్రి కాలిపోయాయని యజమాని వెంకటనారాయణ వెల్లడించాడు.


