డీడీఎన్ అర్చక సంఘంపై దుష్ప్రచారం మానుకోవాలి
ఖమ్మంగాంధీచౌక్: ధూప దీప నివేదన(డీడీఎన్) రాష్ట్ర అర్చక సంఘంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావజ్జల ప్రసాద్‌శర్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మునగలేటి రమేష్‌శర్మ, మరిగంటి భార్గవాచార్యులు సూచించారు. ఖమ్మంలో శుక్రవారం వారు మాట్లాడుతూ కొందరు అర్చకులు పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి దేవాదాయ శాఖపై పెత్తనం చెలాయించడమే కాక ధూప దీప నివేదన పథకంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ సంఘం అర్చకులకు ఉద్యోగ భద్రత, వేతన పెంపు కోసం సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వైరా నదిలో వ్యక్తి గల్లంతు
వైరారూరల్: మండలంలోని గన్నవరంలో జాలిముడి ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న వైరా నదిలో ప్రమాదవశాత్తు పడిన వ్యక్తి గల్లంతయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అనంతగిరికి చెందిన షేక్ నాగుల్ మీరా(32) సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల కల్లూరు మండలం చిన్నకోరుకొండిలోని అత్తగారింటికి వెళ్లాడు. పండుగ ముగిశాక ద్విచక్ర వాహనంపై శుక్రవారం అనంతగిరి వెళ్తుండగా మార్గమధ్యలో వైరా లోలెవల్ వంతెనపై వాహనం అదుపు తప్పినట్లు తెలిసింది. దీంతో నాగుల్‌మీరా వైరా నదిలో పడడంతో గల్లంతయ్యాడు. ఈ మేరకు వైరా ఎస్సై పుష్పాల రామారావు చేరుకుని వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు తెలుసుకుని నాగుల్‌మీరా కుటుంబానికి సమాచారం ఇచ్చి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
టీజీబీలో చోరీకి
విఫలయత్నం
కల్లూరు రూరల్: కల్లూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. బ్యాంకు కిటికీ చువ్వలు తొలగించి లోనకు ప్రవేశించాక లాకర్ గది తాళాలు సైతం పగలగొట్టాడు. అయితే, బ్యాంకు మొత్తం కలియదిరిగినా చోరీకి అవకాశం లేకపోవడంతో నిందితుడు వెనుతిరిగాడు. బ్యాంకుకు గురువారం సెలవు కావడంతో శుక్రవారం ఉదయం వచ్చిన ఉద్యోగులు చోరీకి జరిగిన యత్నాన్ని గుర్తించారు. ఆపై బ్యాంకు మేనేజర్ తన్నీరు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో కల్లూరు పోలీసులు, ఖమ్మం సీసీఎస్ పోలీసులు బ్యాంకులో పరిశీలించగా, కేసు దర్యాప్తు చేసుకున్నట్లు ఎస్సై హరిత తెలిపారు.
గంజాయి స్వాధీనం
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం సమీపాన ఐదుగురి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. గ్రామసమీపంలోని వెంచర్‌లో ఖమ్మం నగరానికి చెందిన ఐదుగురు అనుమానితులు ఉన్నారని అందిన సమాచారంతో తనిఖీల చేపట్టరు. ఈ సందర్భంగా వారి నుంచి 65 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కిన్నెరసానిలో సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో సంక్రాంతి సందడి నెలకొంది. గురు, శుక్రవారం పర్యాటకులు తరలివచ్చారు. జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 750 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.63,525 ఆదాయం లభించింది. 580మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.35,040 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
డీడీఎన్ అర్చక సంఘంపై దుష్ప్రచారం మానుకోవాలి


