● రామారావు హత్య కేసులో పోలీసుల నిర్ణయం? ● 18మందిలో ఎంద
మరోమారు ‘పాలిగ్రాఫ్’ నోటీసులు
చింతకాని: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందనే చర్చ జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్ 31న పాతర్లపాడు గ్రామంలోని ఇంట్లోనే రామారావును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో హత్య జరగడం, దీనిపై రాజకీయ ఆరోపణలు రావడంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినా ఫలితం కానరాలేదు. ఈక్రమాన పాలిగ్రాఫ్ పరీక్షలు(లై డిటెక్టర్) నిర్వహించేందుకు మొగ్గుచూపిన పోలీసులు.. అనుమానితులు, సాక్షులుగా ఉన్న 24 మంది పేర్లతో ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హత్యకు గురైన రామారావు భార్య, కుమారుడు, కుమార్తె, అల్లుడితో పాటు కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన నాయకుల పేర్లు ఉన్నా కొందరే అంగీకరించడంతో పోలీసులు మిగతా వారికి రెండో సారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.
కొందరే ఓకే..
పాలిగ్రాఫ్ పరీక్షకు పోలీసులు కోరిన 24మంది జాబితా నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురే అంగీకరించారు. దీంతో వీరిని బెంగళూరు పంపించగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల ఆధ్వర్యాన పాలిగ్రాఫ్ పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన 18మందిలో కుటుంబసభ్యులు, సీపీఎం నాయకులు తదితరులు పాలిగ్రాఫ్ పరీక్షకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు మరో మారు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రామారావు హత్య కేసులో కుటుంబీకులు, సీపీఎం శ్రేణులే బాధితులైనప్పుడు పరీక్షలకు ఎలా అంగీకరిస్తామని పార్టీ నాయకులు ప్రశ్ని స్తున్నారు. వీరికి మరోమారు నోటీసులు ఇచ్చినా స్పందన రాకపోతే రామారావు హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోతుందా, పోలీసులు ప్రత్యామ్నా య దారులు వెతుకుతారా అనేది తేలాల్సి ఉంది.
ఆరుగురికి వైద్య పరీక్షలు
పాలిగ్రాఫ్ పరీక్షకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఆరుగురికి బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో గురువారం వైద్యపరీక్షలు నిర్వహించారు. పాలిగ్రాఫ్ పరీ క్షలో భాగంగా మంగళ, బుధవారం ప్రాథమిక సమాచారం సేకరించిన నిపుణులు పరీక్షలు చేయించారు. అనంతరం రోజుకు ఇద్దరు చొప్పున పాలి గ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


