క్షతగాత్రుల్లో మరొకరు మృతి
● మూడుకు చేరిన మృతుల సంఖ్య
ఖమ్మంఅర్బన్: పండుగ సందర్భంగా ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్న నలుగురు స్నేహితులు కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో తొలుత ఇద్దరు మృతి చెందగా, చికిత్స పొందుతున్న ఇంకొకరు మృతి చెందాడు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన దోమల మధు, కోట మధు, జి.శ్రావణ్ (25), బానోతు రాము స్నేహితులు కాగా కొందరు కార్ డ్రైవర్లుగా, మరికొందరు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా బుధవారం కారులో రఘునాథపాలెం వైపు వెళ్లి వస్తుండగా మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయాన అతివేగంగా ఉండడంతో స్తంభం విరిగిపోగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనాస్థలిలోనే కారు నడుపుతున్న దోమల మధు, ఆస్పత్రికి తరలించేలోగా కోట మధు మృతి చెందాడు. ఇక జి.శ్రావణ్, బానోతు రాముకు తీవ్రగాయాలు కాగా శ్రావణ్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
రోడ్డుప్రమాదంలో వృద్ధుడు..
పెనుబల్లి: మండలంలోని శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద శుక్రవారం గుర్తు తెలియని కంటైనర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా పెనుబల్లికి చెందిన మారుతి నారాయణ(70)కు తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లిలో తన కుమార్తె వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరడడంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అరగంటసేపు పైగా వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. ఇక తుమ్మలపల్లి శివారులో వీఎం బంజర వైపు వస్తున్న కారును ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో బైౖక్‌పై వెళ్తున్న మండాలపాడు వాసి సన్నల మారేశ్వరరావుకు గాయాలయ్యాయి. ఆయనను ఎస్సై వెంకటేష్ పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని చనుబండ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబల్లికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చిలక బత్తుల చెన్నారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన బైక్‌పై ్ప విస్సన్నపేట వెళ్లి వస్తుండగా కారు ఢీకొట్టడంతో చెన్నారావుతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.


