అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
కారేపల్లి:
బొలేరో వాహనంలో అక్రమంగా
తరలిస్తున్న కలపను మండలంలోని బస్వాపురం వద్ద కారేపల్లి అటవీశాఖ ఉద్యోగులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రిజిల్లా టేకులపల్లి నుంచి కారేపల్లి మండలం మీదు గా బొలేరో వాహనంలో కొందరు కలపను ఖమ్మం వైపు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలి సింది. ఈ వాహనాన్ని కారేపల్లిలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయానికి తరలించి విచారణ చేపడుతున్నారు. అయితే, వివరాలను గోప్యంగా ఉంచడం, మీడియాకు సమాచారం ఇవ్వకపోవడంతో అటవీ అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దారి పంచాయితీలో దాడి
నేలకొండపల్లి: దారి పంచాయితీ విషయమై జరిగిన గొడవలో కుటుంబంపై దాడి చేయగా ముగ్గురికి గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన జోగుపర్తి నాగేశ్వరరావుకు మండ్రాజుపల్లి కొత్తూరుకు చెందిన రైతుల మధ్య పొలా లకు వెళ్లే దారి విషయమై గొడవలు జరుగుతున్నా యి. ఈక్రమాన మంగళవారం నాగేశ్వరరావు కోడలు అనూష, అత్త లక్ష్మి, మనవరాలు చరణ్య పొలం వద్దకు వెళ్లి వస్తుండగా మండ్రాజుపల్లి కొత్తూరుకు చెందిన శ్రీనివాసరావు తదితరులు అడ్డగించి దాడి చేశారని తెలిపారు. ఇంతలోనే చెన్నారం గ్రామస్తులు వస్తుండగా వారు వాహనాల్లో పారిపోయారని పేర్కొన్నారు. దాడిలో ముగ్గురు గాయపడగా ఘటనపై అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు
ఖమ్మంక్రైం: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరిపై ఖమ్మం టూటౌన్ పోలీసులు మంగళవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన కిషోర్‌రెడ్డి వద్ద లెనిన్‌నగర్ వాసి అషారఫ్ చైనా మాంజాను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి 40బండిళ్ల చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అషారప్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న కిషోర్‌రెడ్డి కోసం గాలిస్తున్నామని టూ టౌన్ పోలీసులు తెలిపారు.


