అటవీ సంరక్షణపై ముగ్గుల పోటీలు
ఖమ్మంవ్యవసాయం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరూవాడ ముగ్గుల పోటీలు జరుగుతుండగా అటవీ శాఖ వినూత్న రీతిలో పోటీలు నిర్వహించింది. వన్యప్రాణులు, వృక్షాల సంరక్షణే ఇతివృత్తంగా ఖమ్మంలోని అటవీ శాఖ కార్యాలయాల సముదాయంతో పాటు పులిగుండాల, నీలాద్రి అర్బన్ పార్క్‌ల్లో నిర్వహించిన పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పొల్గొన్నారు. వన్యప్రాణులు, అటవీ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేశాక డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడారు. సంప్రదాయ కళల ద్వారా ప్రజలకు పర్యావరణ బాధ్యతను గుర్తు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఎఫ్‌డీఓ మంజుల, అధికారులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందించిన డీఎఫ్‌ఓ
అటవీ సంరక్షణపై ముగ్గుల పోటీలు


