ఎల్‌ఐజీ ఫ్లాట్లకు 18వరకు దరఖాస్తుల స్వీకరణ
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం శ్రీరామ్‌నగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన ఎల్‌ఐజీ ప్లాట్ల కోసం ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జీవీ.రమణారెడ్డి తెలిపారు. అల్పాదాయ వర్గాలకు మాత్రమే కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తు గడువు పొడిగించామని పేర్కొన్నారు. ఫ్లాట్లకు సంబందించి అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 18వ తేదీలోగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఆపై 19వ తేదీన బ్లాక్‌ల వారీగా కాకుండా అన్ని ఫ్లాట్లకు కలిపి లాటరీ నిర్వహిస్తామని తెలిపారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఖమ్మంరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 18న జిల్లాకు రానుండగా పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఏదులాపు రం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి మార్కెట్ ఆవరణలో హెలీప్యాడ్ నిర్మాణం, సభ నిర్వహణకు ఏర్పాట్లను పోలీసు కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా ఏదులాపురంలో జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, రూ.25కోట్లతో నిర్మించిన మద్దులపల్లి మార్కెట్ యార్డు, రూ.18కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాలను ప్రారంభించాక మార్కెట్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన సేవలు
ఖమ్మం అర్బన్: బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, ఉద్యోగులు పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డి.రామారావు సూచించారు. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సాఆర్ నగర్‌లోని బస్తీ దవాఖానాను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారీ ఓపీ, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించాక డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. మాతా–శిశు సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ద్వారా ఓపీ సేవలను నిరంతరం నిర్వహించాలని తెలిపారు. అలాగే, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
పురాతన సామగ్రిని పరిశీలించిన ఏడీ
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం వద్ద అభివృద్ధి పనుల సందర్భంగా చేపడుతున్న తవ్వకాల్లో పురాతన కాలం నాటి వస్తువులు బయటపడుతున్నాయి. ఈనేపథ్యాన పురావస్తు శాఖ అిసిస్టెంట్ డైరెక్టర్ డి.బుజ్జి మంగళవారం వీటిని పరిశీలించారు. సామగ్రి ఏ కాలం నాటివి, వాటి ప్రత్యేకతలపై అధికారులతో చర్చించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ బౌద్ధక్షేత్రం వద్ద పనులు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక తవ్వకాల్లో బయటపడిన సామగ్రిని భద్రపరుస్తున్నామని వెల్లడించారు.
ఆనందంగా
పండుగ జరుపుకోండి
● పోలీస్ కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరపున పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా, సాంప్రదాయ రీతిలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్వస్థలాలు, యాత్రలకు వెళ్లే వారు విలువైన వస్తువులను భద్రపర్చుకోవా లని సూచించారు. ఎక్కడైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే స్థానికులు డయల్ 100కి తెలియజేయాలని కోరారు. గాలిపటాలు ఎగురవేసే వారు చైనా మాంజా వినియోగించి ఇతరులకు ముప్పు కలిగించొద్దని సీపీ సూచించారు.
ఎల్‌ఐజీ ఫ్లాట్లకు 18వరకు దరఖాస్తుల స్వీకరణ
ఎల్‌ఐజీ ఫ్లాట్లకు 18వరకు దరఖాస్తుల స్వీకరణ


