మహిళా డెయిరీలో సభ్యత్వం తీసుకోండి
చింతకాని: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులంతా ఇందిరా మహిళా డెయిరీలో సభ్యత్వం కలిగి ఉండాలని డీఆర్‌డీఓ సన్యాసయ్య సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం జరిగిన చింతకాని, బోనకల్ మండలాల ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డెయిరీ ప్రారంభ దశలో ఉన్నందున మహిళలు సమష్టిగా కష్టపడితే త్వరలోనే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు, సీ్త్ర నిధి బకాయిల వసూళ్లపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఇంకా ఈ సమావేశంలో డెయిరీ ఏపీఓ నర్సింహులు, సీ్త్ర నిధి రీజనల్ మేనేజర్ రవీందర్ నాయక్, డీపీఎం ఆంజనేయులుతో పాటు లింగం వీరమ్మ, నాగపుల్లారావు, వెంకటేశ్వర్లు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.


