వరి పంటకు నీరు అందక రైతుల ఆందోళన
తల్లాడ: ఎన్‌ఎస్‌పీకాల్వల ద్వారా పంటలకు సరిపడా నీరు సరఫరా చేయాలని కోరుతూ పలువురు రైతులు నిరసన తెలిపారు. వరిపైరుకు నీరందకు పొలాలు బీటలు వారుతున్నందున వారబందీ విధానం ఎత్తి వేసి నిరాటంకంగా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తల్లాడ మండలం సిరిపురం మేజర్ పరిధి తెలగవరం మైనర్ కాల్వ, రేజర్ల సబ్ మైనర్‌కాల్వకింద 2,200ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వల పరిధి లో రెండు వేల ఎకరాల్లో నెల నుంచి వరి సాగు చేస్తుండగా నీరందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగా రు. బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, గాంధీనగర్‌తండా, రేజర్ల గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ పొలాల్లో కూర్చుని అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఎన్నెస్పీ డీఈ శ్రీనివాసరావు.. ఏఈ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి రైతులతో మాట్లాడారు. ఈనెల 14 నుంచి వారబందీ ప్రకారం తెలగవరం, రేజర్ల సబ్ మైనర్‌కు వరుసగా నాలుగు రోజుల పాటు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.


