నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పాత ఎంపీడీఓ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ కార్యాలయ భవనం, బస్టాండ్ ఎదుట వెజిటబుల్ మార్కెట్, పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, గుర్రాలచెరువు పాత జీపీ కార్యాలయం సమీపాన రోడ్లు, డ్రెయినేజీలకు, ధనికుంట చెరువు వద్ద ట్యాంక్‌బండ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తా రు. ఆతర్వాత నియోజకవర్గంలో నూతనంగా ఎంపికై న సర్పంచ్‌ల అభినందన సభలో పాల్గొంటారు. అనంతరం దమ్మపేటలో మందలపల్లి క్రాస్ వద్ద డివైడర్లు, సీసీ డ్రెయిన్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత సత్తుపల్లిలో నూతనంగా ఎంపికై న గ్రామపంచాయతీ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొంటారు.
రేక్ పాయింట్‌కు 2,680 మె.టన్నుల యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఇఫ్‌కో కంపెనీకి చెందిన 2,680.02 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,610.02 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 450 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 620 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఆయా జిల్లాల గోదాములకు పంపించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు.
సీఆర్‌పీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మహబూబ్
బోనకల్: కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల(సీఆర్‌పీ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జానకీపు రం గ్రామానికి చెందిన షేక్‌మహబూబ్‌పాషా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో సోమవా రం జరిగిన సీఆర్‌పీల రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ సీఆర్‌పీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
అథ్లెట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: ఆదిలాబాద్‌లో ఈనెల 18న జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవా రం జరిగిన ఎంపిక పోటీలకు 43 మంది బాలు రు, 39మంది బాలికలు హాజరయ్యారు. అండర్–8బాలుర విభాగంలో ఎం.వివేక్, విశ్వన్, అండర్–10బాలుర విభాగంలో ఎం.పూజిత్, ఇమీష్‌ప్రీత్, ఉత్తేజ్, అండర్–12 బాలురలో జె. లోకేష్, ఉపేక్షిత్‌వర్మ, అండర్–14లో కె. వేణు, తీమంత్, అండర్–20 విభాగంలో కె.మస్తాన్ ఎంపికయ్యారు. ఇక బాలికల విభాగంలో అండర్–10 నుంచి డి.లలిత, ఆర్.లికిత, తరుణి, అండర్–12లో జి.భాగ్యలక్ష్మి, బి.రుతిక, భవిత, అండర్–14లో ఎస్.భార్గవి, టి.రేష్మ, కె.సంజన, అండర్–20లో హర్షిత, ఓ.బింద్య ఎంపికయ్యారు. ఈ ఎంపిక పోటీలను కోచ్ గౌస్, తదితరులు పర్యవేక్షించారు.
మధిరలో దొంగల హల్‌చల్
మధిర: మధిరలో పలు చోట్ల ఆదివారం రాత్రి చోరీలు జరగడం స్థానికుల్లో కలకలం రేపుతోంది. ఆజాద్ రోడ్డులో ఓ వ్యక్తి ఇటీవల కొనుగో లు చేసిన ఆటో చోరీ దుండగులు అదే ఆటోలో రాయపట్నం సెంటర్‌లోని కూల్‌డ్రింక్ షాప్‌లో రూ.10వేల నగదు, సిగరెట్ పెట్టెలు, కూల్‌డ్రింక్ బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అలాగే, అంబేద్కర్ సెంటర్, పాత ఆంజనేయస్వామి టెంపుల్ ఏరియాల్లోని పలుషాపుల్లో చోరీ జరగగా బాధితులు సోమవారం మధిర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపునకు చర్యలు చేపట్టామని సీఐ రమేష్ తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన కారు : మహిళ మృతి
తిరుమలాయపాలెం: బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై కుమారుడి కారులో వస్తున్న మహిళ కొద్ది సేపట్లో ఇంటికి చేరుతుందనగా ప్రమాదంలో మృత్యువాత పడింది. ఖమ్మం శాంతినగర్‌కు చెందిన సయ్యద్ రజియాసుల్తానా(61) తన కుమారుడు రఫీయుద్దీన్‌తో కలిసి వరంగల్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అక్కడి నుంచి ఆదివారం రాత్రి ఇంటికి వస్తుండగా మండలంలోని పాతర్లపాడు స్టేజీ వద్ద కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొట్టింది. ఘటనలో రజియాకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తిరుమలాయపాలెం పోలీసులు తెలిపారు.


