కంటికి అడ్డుగా కణితి..
తల్లిదండ్రుల వినతితో గ్రామస్తుల చేయూత
పెనుబల్లి: కంటికి అడ్డుగా కణితి ఉండటంతో చిన్నారి నరకం చూస్తోంది. ఈ కణితి తొలగింపునకు చేయాల్సిన శస్త్రచికిత్సకు దాతలు సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు గ్రామానికి చెందిన కంచు నాగరాజు – తిరుపతమ్మ దంపతులు కూలి పనులతో జీవ నం సాగిస్తున్నారు. వీరి నాలుగేళ్ల కుమార్తె వర్షిణి ఏడాది వయస్సులోనే కంటి పక్కన కణితి ఏర్పడి పెరుగుతూ వచ్చింది. మందులు వాడినా తగ్గకపోవడంతో ఆపరేషన్ చేయాల ని, అందుకు రూ.5 లక్షలు వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. రోజూ పనికి వెళ్తే తప్ప జీవనం సాగించలేని పేదలు కావడంతో దాతలను ఆశ్రయించగా రూ.66వేలు జమ చేసి కాంగ్రెస్ నాయకుడు అలుగోజు చిన్న నర్సింహాస్వామి చేతుల మీదుగా సోమవారం అందచేశారు. చిన్నారి శస్త్రచికిత్స కోసం అవసరమైన నగదు ఇవ్వాలనుకునే దాతలు 955309 5875 సెల్‌నంబర్‌కు పంపించాలని నాగరాజు దంపతులు కోరారు.
చూస్తుండగానే
కుప్పకూలిన వ్యక్తి
కానిస్టేబుల్ సీపీఆర్ చేసినా దక్కని ఫలితం
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో ఓ వ్యక్తి అంతా చూస్తుండగా కుప్పకూలగా, ప్రాణాలను కాపాడేందుకు కానిస్టేబుల్ సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ముదిగొండకు చెందిన రమేష్(59) రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత పనులపై సోమవారం నేలకొండపల్లి వచ్చాడు. ఇక్కడ ప్రధాన సెంటర్‌లో నిలబడి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ చరణ్‌సింగ్ ఆయనకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


