తలసేమియా రహిత సమాజమే లక్ష్యం
ఖమ్మంవైద్యవిభాగం: చిన్నారులు తలసేమియా వ్యాధి బారిన పడకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కృషి చేస్తోందని అధ్యక్షురాలు డాక్టర్ రెహానా బేగం తెలిపారు. ఖమ్మంలో సోమవారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన శిబిరంలో జాతీయ తలసేమి యా వెల్ఫేర్ సొసైటీ వైద్యులు చిన్నారులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెహానా బేగం మాట్లాడుతూ తలసేమియాను అరికట్టడానికి వివాహానికి ముందే అవసరమైన పరీక్షలు చేయించుకునేలా యువతకు అవగాహన కల్పిస్తామని తెలి పారు. ఖమ్మం సీటీసీ అడిషనల్ డీసీపీ విజయ్ బాబు మాట్లాడుతూ చిన్నారులకు అవసరమైన రక్తం శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం జాతీయ తలసేమియా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఎస్.అరోరా మాట్లాడు తూ తెలంగాణలో తలసేమియా చిన్నారులకు అందుతున్న సేవలు అద్భుతమని కొనియాడారు. అలాగే, సంకల్ప సంస్థ చేయూతతో చిన్నారులకు సమయానికి రక్తం, మందులు సమకూర్చడం అభినందనీయమన్నారు. సంస్థ అధ్యక్షురాలు పి.అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరరావుతో పాటు డాక్టర్ డి. నారాయణమూర్తి, డాక్టర్ లక్ష్మీదీప, డాక్టర్ నరేష్, పి.పావని, పి.రవిచందర్, పి.ఉదయ్‌భాస్కర్, పి. వంశీకిరీటి తదితరులు పాల్గొన్నారు.


