బీఆర్‌ఎస్ హయాంలోనే మధిర అభివృద్ధి
మధిర: బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మధిర మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నా రు. మధిరలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా మధిరలో జరిగినా అభివృద్ధి కానరావడం లేదని తెలిపారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురైనా మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇదే స్ఫూర్తి మున్సిపల్ ఎన్నికల్లో నమోదు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడమే కాక భట్టి సంతకంతో కూడిన గ్యారంటీ కార్డు ఇచ్చిన విషయాన్ని వివరించాలని తెలిపారు. దీని స్థానంలో బాకీ కార్డు ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. కాగా, మధిరలో 100 పడకల ఆస్పత్రిని బీఆర్‌ఎస్ హయాంలో నిర్మిస్తే ఇప్పుడు ప్రా రంభించి క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని నామా ఎద్దేవా చేశారు. తొలుత టీడీపీ నాయకులు పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరాగా వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు


