మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు | - | Sakshi
Sakshi News home page

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు

Jan 12 2026 7:37 AM | Updated on Jan 12 2026 7:37 AM

మంత్ర

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు

దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు. మండలంలోని గండుగులపల్లిలో ఉన్న మంత్రి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని స్థానాల్లోను కాంగ్రెస్‌ పార్టీ గెలిచేలా ప్రణాళికలు రూపొందించాలని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రంగా జనార్ధన్‌ రావు, మురళీకృష్ణ, ముళ్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రైడ్‌ ఆఫ్‌ భారతరత్న అవార్డు బహూకరణ

కల్లూరు రూరల్‌ : వినూత్న బోధనా పద్ధతులు అవలంబించడంతో పాటు సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం ఎండీ మౌలాలిని ప్రైడ్‌ ఆఫ్‌ భారతరత్న అవార్డు వరించింది. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆదివారం హైదరాబాద్‌ రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు అవార్డు ప్రదానం చేశారు. గణిత బోధనలో వినూత్న పద్ధతులు, ప్రత్యేకంగా మ్యాథ్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో గణిత భయాన్ని తొలగించినందుకు గాను ఈ అవార్డు బహూకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, తెలుగు సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి.రామకృష్ణ గౌడ్‌, జీసీఎస్‌ వల్లూరి ఫౌండేషన్‌ నేషనల్‌ చైర్మన్‌ శ్రీనివాసరాజు ఈ అవార్డును అందజేశారు.

వంతెనపై ట్రాఫిక్‌ జామ్‌

వైరారూరల్‌: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్‌ వంతెనపై ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ స్తంభించింది. వైరా వైపు నుంచి తల్లాడ వైపు వెళ్తున్న ఒక భారీ వాహనం వంతెనపైకి రాగానే ముందు టైరు పంక్చర్‌ కావడంతో ఆగిపోయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా సుమారు అటు, ఇటు కిలో మీటర్‌ మేర ట్రాఫి క్‌ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంక్చర్‌ అయిన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మూడేళ్ల తర్వాత

కుటుంబం చెంతకు..

ఖమ్మంఅర్బన్‌: మూడేళ్ల కిందట తప్పిపోయిన ఓ వృద్ధురాలు.. ఆదివారం తిరిగి కుటుంబం చెంతకు చేరింది. ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు పరిసర ప్రాంతాల్లో 2023 జూలైలో సుమారు 70 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలు తిరుగుతుండగా కానిస్టేబుల్‌ ఇచ్చిన సమాచా రం మేరకు అన్నం ఫౌండేషన్‌ నిర్వాహకులు ఆశ్రమానికి తరలించి వైద్య చికిత్స అందించా రు. ఇటీవల కోలుకున్న వృద్ధురాలు తన పేరు మధు వెంకటలక్ష్మి అని.. వివరాలు చెప్ప డంతో అన్నంఫౌండేషన్‌ సిబ్బందిఇంటర్నెట్‌ ద్వారా ఆచూకీ గాలించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రకాశంజిల్లా, కంభం మండలం అని గుర్తించి, అక్కడి ఎస్‌ఐకి వా ట్సాప్‌ ద్వారా ఫొటో, వివరాలు పంపించారు. అక్కడి పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యుల ఆచూకీ లభించింది. వీడియో కాల్‌ ద్వారా తల్లిని గుర్తించిన చిన్న కుమారుడు చిన్న గురవయ్య తన చెల్లెలితో కలిసి ఖమ్మం చేరుకొని, ఆధార్‌కార్డు తదితర ఆధారాలు చూపించడంతో అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావు వెంకటలక్ష్మిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు1
1/3

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు2
2/3

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు3
3/3

మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement