మెగా వైద్యశిబిరం విజయవంతం
కల్లూరురూరల్: మండలంలోని చండ్రుపట్లలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. గ్రామానికి చెందిన కాటంనేని ముత్తయ్య, ద్రౌపది జ్ఞాపకార్థం ప్రముఖ లాయర్ కాటమనేని రమేశ్ లండన్‌లో డాక్టర్‌గా స్థిరపడిన కాటమనేని రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం నిర్వహించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, పీడియాట్రీషియన్, చర్మవ్యాధి, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్‌కు సంబంధించి రోటరీక్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, హాస్టల్ ప్రైమ్ హాస్పిటల్స్ హైదరాబాద్, బసవతారకం కేన్సర్ ఆస్పత్రుల వైద్య నిపుణులచే ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చండ్రుపట్లతో పాటు రఘునాథబంజరు, రఘునాథగూడెం, కల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు.
సామాజిక సేవలో పాల్గొనాలి..
సామాజిక సేవ కార్యక్రమాల్లో వైద్యులు భాగస్వాములు కావాలని కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్ కోరారు. చండ్రుపట్లలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించిన కాటమనేని రమేశ్, కాటమనేని రవీంద్రకుమార్‌ను అభినందించారు. ఏసీపీ వసుంధరయాదవ్ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాటమనేని విజయలక్ష్మి, వల్లభనేని భాస్కర్‌రావు, రాధాకృష్ణ, రవి పాల్గొన్నారు.
పరిశీలించిన సబ్ కలెక్టర్ అజయ్,
ఏసీపీ వసుందర


