కేఎన్‌ఎం–1638 రకంతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

కేఎన్‌ఎం–1638 రకంతో అధిక దిగుబడి

Apr 12 2025 2:58 AM | Updated on Apr 12 2025 2:58 AM

కేఎన్

కేఎన్‌ఎం–1638 రకంతో అధిక దిగుబడి

వైరారూరల్‌: జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా అందజేసిన కేఎన్‌ఎం 1638 రకం వరి విత్తనాలతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని అష్ణగుర్తిలో కేఎన్‌ఎం రకంతో సాగు చేసిన వరి పొలాలను శుక్రవారం పరిశీలించిన ఆయన రైతులకు సూచనలు చేశారు. ఈ రకంతో పంట 120 రోజుల్లో కోతకు వస్తుందని, అగ్గితెగులు, ఉల్లికోడు తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. పంట ఏపుగా పెరిగి అధిక దుబ్బులతో కంకులు ఏర్పడతాయని, దిగుబడి ఎకరాకు 30–35 బస్తాలు వస్తుందని డీఏఓ వెల్లడించారు. ఏడీఏలు తుమ్మలపల్లి వాసవి రాణి, ఏఓలు మయాన్‌ మంజూఖాన్‌,ప్రత్యుష, పవన్‌కుమార్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న

అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు

తల్లాడ: తల్లాడ మండలం కుర్నవల్లిలో నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాల స్దాయి కబడ్డీ పోటీలు శుక్రవారం రెండోరోజుకు చేరాయి. కుర్నవల్లిలోని వేంకటాచలపతి దేవాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యాన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు జరిగిన మ్యాచ్‌లో ఏపీలోని వైజాగ్‌ జట్టుపై తమిళనాడు జట్టు విజయం సాధించింది. శనివారం పోటీలు ముగియనుండగా, విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి

కల్లూరు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్‌ రజితోత్సవ సభను జయప్రదం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కల్లూరులో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సందర్భంగా గ్రామగ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించాక ఎల్కతుర్తి బయలుదేరాలని కోరారు. ఈసమావేశంలో మాజీ జెడ్పీటీసీలు కట్టా అజయ్‌కుమార్‌, లక్కినేని రఘు, మేకల కృష్ణ, నాయకులు నర్వనేని అంజయ్య, బొల్లం వెంకటేశ్వరరావు, దేవరపల్లి భాస్కర్‌రావు, కాటమనేని వెంకటేశ్వరరావు, కొరకొప్పు ప్రసాద్‌, కళ్యాణపు కొండలరావు, ఎస్‌.కే.కమ్లి, సీహెచ్‌.కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

యువకుడి అవయవదానం

కూసుమంచి: మండలంలోని పెరికసింగారం గ్రామానికి చెందిన బత్తుల నవీన్‌(22) ఓ కంపెనీలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తుండగా నాలుగు రోజుల క్రితం ఖమ్మంరూరల్‌ మండలం మారెమ్మగుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా గురువారం బ్రెయిన్‌డెడ్‌ అయిందని వైద్యులు నిర్థారించారు. ఈమేరకు వైద్యులు అవగాహన కల్పించగా, ఆయన కుటుంబీకులు అవయవాలను దానం చేశారు. అనంతరం శుక్రవారం నవీన్‌ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు.

పట్టు పరిశ్రమల సందర్శన

ఖమ్మంవ్యవసాయం: పట్టు పరిశ్రమ, మల్బరీ తోటల పెంపకంపై అవగాహన కల్పించేలా జిల్లా రైతులకు స్టడీ టూర్‌ ఏర్పాటుచేశారు. వైరా మండలం రెబ్బవరం, గన్నవరం గ్రామాలకు చెందిన 30రైతులను శుక్రవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కోరింతకుంటకు తీసుకెళ్లారు. అక్కడ మల్బరీ తోటలు, పట్టు పరిశ్రమలను పరిశీలించి రైతులు అనుభవాలను తెలుసుకున్నారు. జిల్లా పట్టు పరిశ్రమ ఉపంచాలకులు ముత్యాలు, అధికారులు కామేశ్వరరావు, దేవరాజు పాల్గొన్నారు.

కేఎన్‌ఎం–1638  రకంతో అధిక దిగుబడి
1
1/3

కేఎన్‌ఎం–1638 రకంతో అధిక దిగుబడి

కేఎన్‌ఎం–1638  రకంతో అధిక దిగుబడి
2
2/3

కేఎన్‌ఎం–1638 రకంతో అధిక దిగుబడి

కేఎన్‌ఎం–1638  రకంతో అధిక దిగుబడి
3
3/3

కేఎన్‌ఎం–1638 రకంతో అధిక దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement