ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌కు నివాళి
ఖమ్మంక్రైం/వైరా రూరల్: నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ మంగళవారం రాత్రి ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బండి కృష్ణ మృతదేహం వద్ద పోలీసు ఉద్యోగులు నివాళులర్పించారు. పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, నేలకొండపల్లి, వైరా ఎస్సైలు సంతోష్, ఏవీకే.భాగ్యరాజ్ తదితరులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం కృష్ణ మృతదేహాన్ని స్వగ్రామమైన వైరా మండలం రెబ్బవరం తరలించగా 2009బ్యాచ్ కానిస్టేబుళ్లు మాతంగి విజయ్, భూక్యా బాల్య, కొలికపాక రంగారావు తదితరులు నివాళులర్పించి దహన సంస్కారాలకు రూ.10 వేల నగదు అందజేశారు.


