ఆకాశపు అంచులకు... | - | Sakshi
Sakshi News home page

ఆకాశపు అంచులకు...

Jan 15 2026 10:49 AM | Updated on Jan 15 2026 10:49 AM

ఆకాశప

ఆకాశపు అంచులకు...

● దశాబ్దాల ‘గాలిపటం’ ప్రస్థానం ● తొలినాళ్లలో కాగితాలతోనే పతంగుల తయారీ ● నేడు ప్లాస్టిక్‌ కవర్లు, వివిధ ఆకృతుల్లో సిద్ధం

కాగితం పోయింది...

35ఏళ్లుగా విక్రయిస్తున్నా..

● దశాబ్దాల ‘గాలిపటం’ ప్రస్థానం ● తొలినాళ్లలో కాగితాలతోనే పతంగుల తయారీ ● నేడు ప్లాస్టిక్‌ కవర్లు, వివిధ ఆకృతుల్లో సిద్ధం

ఖమ్మంమయూరిసెంటర్‌: సంక్రాంతి వస్తే ఇంట్లో పిండివంటల ఘుమఘుమల స్థాయిలోనే గాలిపటాలు ఎగురవేసే వారి సందడి కూడా మొదలవుతుంది. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎగురవేసే గాలిపటాలతో పండుగ మూడు రోజులు ఆకాశం కొత్త అందాలను సంతరించుకుంటుంది. అయితే, గాలిపటం తయారీ వెనుక కొన్ని తరాల శ్రమ, దశాబ్దాల అనుభవం దాగి ఉంది. కేవలం వెదురు బద్ధలు, కాగితాలతో అద్భుత ఆకారాలు సృష్టించే కళాకారుల జీవితం రంగుల కావ్యం కాకున్నా లాభాలు ఆశించకుండా ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారు పలువురు ఉన్నారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా పతంగులు తయారురుచేసి విక్రయించిన పలువురు.. ఇప్పుడు వివిధ ఆకృతుల్లో గాలిపటాలను హోల్‌సేల్‌గా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

తాతల కాలం నాటి వారసత్వం

చాలాచోట్ల గాలిపటాల తయారీ అనేది వ్యాపారంగా కాకుండా కుటుంబ వారసత్వంగా కొనసాగుతోంది. ‘మా తాత ఈ పని మొదలుపెట్టారు, ఇప్పుడు మేము చేస్తున్నాం’ అని గర్వంగా చెప్పే కుటుంబాలు ఖమ్మంలో ఎన్నో ఉన్నాయి. నైజాం కాలం నాటి నుంచి నేటి వరకు మారుతున్న కాలానికి అనుగుణంగా గాలిపటాల రూపాలను మారుస్తూ వీరు ఏటా సంక్రాంతి సమయాన అమ్మకాలు చేపడుతున్నారు. అయితే, దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నవారికి ఇప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి. చేతితో చేసే గాలిపటాల కంటే మిషన్లతో తయారయ్యేవి వచ్చాయి. కాగితం, రసాయనాలు, వెదురు ధరలు పెరగడం వల్ల లాభాలు తగ్గాయి. కేవలం సంక్రాంతి సమయంలోనే డిమాండ్‌ ఉండడంతో మిగతా సమయాన ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోవాల్సి వస్తోంది.

శ్రమతో కూడిన సృజన

గాలిపటం తయారీ వెనుక ఏకాగ్రత, శ్రమ ఉంటాయి. బరువు తక్కువగా ఉంటూనే గాలిలో ఎగురుతున్నప్పుడు విరిగిపోకుండా సరైన వెదురును ఎంచుకోవాల్సిఉంటుంది. దీన్ని సన్నని బద్ధలుగా చెక్కడం ఒక నైపుణ్యం. టిష్యూ పేపర్‌ లేదా ప్లాస్టిక్‌ షీట్లను సరైన కోణంలో అతికించడంపైనే గాలిపటం ఎలా ఎగురుతుందనేది ఆధారపడి ఉంటుంది.

నా చిన్నతనంలో కాగితాలతో తయారుచేసిన గాలిపటాలు రూ.1లోపే అమ్మేవాళ్లం. ఇప్పుడు ధర పెరగడమే కాక ఆకృతి, వాడే కాగితం మారింది. అయినా ఏటా సంక్రాంతికి గాలిపటాలు విక్రయించడం ఆనందంగా ఉంటుంది.

– కె.బ్రహ్మయ్య, ఖమ్మం

నా చిన్నతనంలో మా నాన్న పండుగ పతంగులు అమ్మేవారు. నేను 1989 నుంచి విక్రయిస్తున్నా. తొలుత రిక్కాబజార్‌లో బయ్యా అనే వ్యక్తి వద్ద తెచ్చేవాళ్లం. పిల్లలు పతంగి ఎగురవేస్తుంటే మాకూ సంతోషమవుతుంది.

– కొండ వెంకటేశ్వర్లు, చర్చి కాంపౌండ్‌, ఖమ్మం

ఆకాశపు అంచులకు...1
1/3

ఆకాశపు అంచులకు...

ఆకాశపు అంచులకు...2
2/3

ఆకాశపు అంచులకు...

ఆకాశపు అంచులకు...3
3/3

ఆకాశపు అంచులకు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement