సిరిపురం మేజర్ కాల్వకు బుంగ
తల్లాడ: సాగర్ ప్రాజెక్టు పరిధి మండలంలోని సిరిపురం మేజర్ కాల్వకు మంగళవారం బుంగ పడింది. గోపాలపేట సమీపంలో కాల్వ ఒకటో కిలోమీటర్ వద్ద బుంగ పడగా సాగునీరు వృథాగా పోతోంది. సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా కాల్వ యూటీ రివిట్‌మెంట్‌ను తొలగించడంతో కాలువ కట్ట బలహీనమైన బుంగ పడింది. ఈ సమాచారం అందుకున్న ఎన్నెస్పీ అధికారులు కాల్వకు నీటి పారుదలను 90 క్యూసెక్కుల నుంచి 70 క్యూసెక్కులకు తగ్గించారు. బుంగను బుధవా రం పూడ్చనున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


