ఎన్ని కేసులు పెట్టినా భయపడం..
జగన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తే
అభిమానుల అరెస్టా?
వేడుకలకు డబ్బు ఎక్కడిదని
ఇంటరాగేషన్ చేశారు
ఏపీ వైఎస్సార్‌సీపీ అధికార
ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో కేడర్ ముందుకు సాగుతుందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కారుమూరువెంకటరెడ్డి తెలిపారు. ఖమ్మంలో వైఎస్సా ర్, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులను మంగళవారం పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడా రు. జిల్లాకుచెందిన మంత్రి,ఆయన కుమారుడు తప్పు డు కేసులు బనాయించడం మానేసి జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ ఇక్కడ లేకపోయినా జగన్ అభిమానులను చూసి భయపడే పరిస్థితి వచ్చిందంటే వారి పని తీరు అర్థమవుతోందన్నారు. ఖమ్మంలో పార్టీ లేకపోయినా జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించడం, ర్యాలీ టీడీపీ ఆఫీస్ ముందు రోడ్డుపై వెళ్తే 11 మందిపై అక్ర మ కేసులు పెట్టారని ఆరోపించారు. అంతేకాక వేడుకలకు డబ్బులు ఎవరైనా పంపించారా.. ప్రతిపక్ష పార్టీ పంపించిందా అంటూ పోలీసులు ఇంటరాగేషన్ చేశారని మండిపడ్డారు. ఖమ్మం టూ టౌన్ సీఐ ముగ్గురిని విపరీతంగా కొట్టారని ఆరోపించారు.
ఏపీలో రెడ్‌బుక్ పాలన..
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తుండగా కోడి, మేకను కోస్తే కేసులు పెడుతూ మనుషుల పీకలు కోసిన తెలుగుదేశం వాళ్లను మాత్రం వదిలేస్తున్నారని వెంకటరెడ్డి విమర్శించారు. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ హత్య, నంద్యాల జిల్లా మచ్చమర్రిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితులు బయ ట తిరుగుతున్నారనితెలిపారు. కాగా, ఖమ్మం వైఎస్సా ర్ కాంగ్రెస్‌కు పెట్టని కోటగా నిలుస్తోందని, తెలంగాణ ప్రజలకు వైఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై విపరీతమైన అభిమానం ఉందని, అభిమానులందరికీ జగన్ అండగా నిలుస్తారని తెలిపారు. జగన్ అభిమానులు గంగరబోయిన రవి, యర్రా నాగరాజురెడ్డి, మర్రిశ్రీనివాస్,ఆలస్యం సుధాకర్, సరి కొం డ రామరాజు, గణపారపు మురళిని వెంకటరెడ్డి పరా మర్శించగా, ఏపీ మాజీ మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, నాయకులు నెల్లూరి రమేష్, లక్కినేని సుధీర్‌బాబు, ఆలస్యం రవి, కన్నెబోయిన సీతరామయ్య, బోనగిరి వెంకటరమణ, ఆదూరి రాజవర్ధన్‌రెడ్డి వాలూరి సత్యనారాయణ, ఆలస్యం నర్సయ్య, కంభం నవీన్, బూరగడ్డ లక్ష్మీనారాయణ, బాలాజీ, కాకుమాని నర్సిరెడ్డి, వాకా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.


