మధిర సమగ్రాభివృద్ధే లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర: మధిర పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు సాయినగర్‌లో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశాక మాట్లాడారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
పరిశీలించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, సీపీ
ఖమ్మంరూరల్: ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యాన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం, ప్రారంభోత్సవాలకు హాజరుకానుండడంతో ఆయా ప్రాంతా ల్లో పరిశీలించి మాట్లాడారు. నర్సింగ్ కళాశాల సమీపాన హెలీప్యాడ్‌ను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, జిల్లాలో జరుగుతున్న అభివృధ్ధి పనులపై శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు రూపొందించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాధ్‌బాబు, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తంబూరు దయాకర్‌రెడ్డి, నాయకులు చెన్నబోయిన వెంకటరమణ, తోట చినవెంకటరెడ్డి పాల్గొన్నారు.
10మంది ఎల్‌టీలు
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రికి పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా వేయికి పైగా ఎల్‌టీ పోస్టులు భర్తీ చేశారు. వీరిలో పది మందిని జిల్లాకు కేటాయించగా బుధవారం సూపరింటెండెంట్ జి.నరేందర్‌కు రిపోర్ట్ చేశారు.
మధిర సమగ్రాభివృద్ధే లక్ష్యం


