సంఘటిత పోరాటాలతో హక్కుల సాధన
కారేపల్లి: ప్రజల్లో విద్వేషాలు సృష్టించి విభజించి పాలించాలని పాలకులు కుట్ర పన్నుతున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఐక్యంగా ఉంటూ సంఘటిత పోరాటాలతో హక్కులను సాధించుకోవాలని సూచించారు. కారేపల్లి మండలం టేకులగూడెంలో మాస్‌లైన్, పీవైఎల్, పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యూ ప్రజాసంఘాల ఆధ్వర్యాన గ్రామపంచాయతీ పాలకవర్గం సన్మానసభ నిర్వహించారు. అలాగే, సర్పంచ్‌గా గుమ్మడి సందీప్, ఉప సర్పంచ్ బిక్కసాని భాస్కరరావు, పాలకవర్గం ఆధ్వర్యాన నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశాక గుమ్మడి నర్సయ్య, రంగారావు మాట్లాడారు. ఓయూ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, మాస్‌లైన్, ప్రజాసంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు చండ్ర అరుణ, టి.ఝాన్సీ, గోకినపల్లి లలిత, కాంపాటి పృధ్వీ, ఎన్‌వీ.రాకేష్, తేజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.


