
తీన్మార్ మల్లన్నను అనర్హుడిగా ప్రకటించాలి
● కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి
బక్క జడ్సన్ దీక్ష
ఖమ్మం సహకారనగర్: వరంగల్ – ఖమ్మం – నల్ల గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను అనర్హుడిగా ప్రకటించాలని స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఈమేరకు డిమాండ్‌తో శుక్రవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరుమలగిరిలో జరిగిన సమావేశంలో తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యల ద్వారా 4.61లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. తనను శాసనమండలికి పంపుతారా లేకుంటే శ్మశానానికి పంపుతారా అనేది తేల్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్య లపై కేంద్ర, రాష్ట్ర ఎన్ని కల సంఘం అధికారులు, ఆర్‌ఓకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే, ఈనెల 16వ తేదీన ఖమ్మం అదనపు కలెక్టర్, ఏఆర్‌ఓ మధుసూదన్ నాయక్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో దీక్ష చేపట్టానని తెలిపారు. ఈమేరకు ఏఆర్‌ఓ మధుసూదన్ నాయక్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేస్తానని చెప్పారని, శుక్రవారం వరకు చర్యలు తీసుకోకుంటే నల్లగొండ ఆర్‌ఓ కార్యాలయం వద్ద దీక్ష చేపడతానని జడ్సన్ వెల్లడించారు.