వైరారూరల్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన స్వగ్రామమైన వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురానికి బుధవారం వచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా నూతి అనంతరాములు జ్ఞాపకార్థం ఆయన కుమారులు నిర్వహించిన ఆన్నదానంలో పాల్గొనగా.. గ్రామస్తులతో మాట్లాడి కుటుంబాల జీవన స్థితిగతులు, ఇతర అంశాలను తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో దొడ్డా పుల్లయ్య, నూతి సత్యనారాయణ, వెంకటస్వామి, వెంకటేశ్వరరావు, పొట్లపల్లి నాగేశ్వరరావు, చిట్జోజు వెంకన్న, పెద్దప్రోలు లక్ష్మయ్య, సంగెపు కృష్ణ, లోకేష్‌యాదవ్ పాల్గొన్నారు.