శిశువులపై శ్రీమతి కన్ను పడితే అంతే

Woman Selling Babies Arrested In Mysore District - Sakshi

మైసూరు: మైసూరు జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న శ్రీమతి అనే మహిళ బాగోతం బయటపడింది. ఎస్పీ చేతన్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. నంజనగూడులో ఇటీవల ఒక చిన్నారి మిస్సయింది. పేద వితంతు మహిళ  మూడు నెలల బిడ్డను శ్రీమతి అనే మహిళ మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. ఈమె పేదలు, యాచకులను కలిసి మీ పిల్లలను తన వద్ద ఉన్న ఆశ్రమంలో చదివించి మంచిగా చూసుకుంటానని తీసుకుని వెళ్లి పిల్లలు లేనివారికి డబ్బులకు విక్రయించేది. ఇటీవల ఒక చిన్నారిని తీసుకెళ్లి రూ. 3 లక్షలకు అమ్మేసిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు శ్రీమతి కోసం గాలిస్తున్నారని, అతి త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.  

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top