కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సీఎం డీకే శివకుమార్
పాల్గొన్న సీఎం, మంత్రి, ప్రతినిధులు
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు పెంపు, నాణ్యమైన విద్య అందించే ఉద్ధేశంతో ‘మన బడి– మన బాధ్యత’ అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. బుధవారం విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో వివిధ సంస్థలు, కార్పొరేట్ రంగాలను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు కంపెనీలు సీఎస్‌ఆర్ నిధులను ప్రభుత్వ బడుల వికాసానికి ఉపయోగించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు బస్సులు, కంప్యూటర్లు, ల్యాబ్ ఉపకరణాలను ఇచ్చి కూడా సహాయం చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు రూ, 8,800 కోట్ల సీఎస్‌ఆర్ నిధుల లభ్యమవుతున్నాయని, ఇందులో సింహభాగం గ్రామీణ ప్రాథమిక పాఠశాలల అభ్యున్నోతికి వినియోగించాలని సీఎం కంపెనీలకు, అధికారులకు సూచించారు. అధిక ఆర్థిక సహాయం చేసే కంపెనీల పేర్లను ఆయా పాఠశాలలకు పెడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లతో అనుసంధానం చేసి అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు.
బెంగళూరుపై తీవ్ర ఒత్తిడి ఉంది
1.40 కోట్ల జనాభా, 1.20 కోట్ల వాహనాలతో బెంగళూరులో ట్రాఫిక్ రద్ధీ విపరీతంగా పెరిగిందని, చదువులు, ఉపాధి, ఉద్యోగాల కోసం భారీగా బెంగళూరుకు తరలిస్తున్నారని చెప్పారు. అందువల్ల రాజధాని నగరంపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప, డిప్యూటీ స్పీకర్ మంకాళ్ వైద్య, ఎంపీ మన్సూర్ ఆలీఖాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమాజం, ప్రైవేటు సంస్థలు
చేయూతనివ్వాలి
మన బడి– మన బాధ్యత నూతన
కార్యక్రమంలో సీఎం డీకే శివకుమార్


