దొడ్డబళ్లాపురం: ఆర్‌ఎస్‌ఎస్ పీటీ టీచర్ చెరువులో శవంగా లభించిన సంఘటన బాగలకోటె జిల్లా ముధోళ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రమోద్ మమదాపుర(44) అనే వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు కర్రసాము, కరాటే తదితర విద్యలు నేర్పించేవాడు. ఈక్రమంలో గత రెండు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేని ప్రమోద్ ముధోళ పట్టణంలోని చెరువులో శవమై తేలాడు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ప్రమోద్‌ది హత్యగా అనుమానిస్తున్నారు. ముధోళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం, హోంమంత్రి
హస్తిన బాట
బనశంకరి: రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ కార్యకలాపాలు మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. మాజీ సీఎం సిద్దరామయ్య ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం సీఎం డీకే.శివకుమార్, హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఢిల్లీ బాట పట్టడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కుతూహలం నెలకొంది. ఢిల్లీ వెళ్లిన సీఎం డీకే.శివకుమార్, మంత్రి ప్రియాంక్ ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌ను కలిసి చర్చలు జరిపారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న స్టింగ్ ఆపరేషన్, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో పార్టీ బలోపేతం, ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై జోరుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో వీరి భేటీ జరిగింది. సిద్దరామయ్య తర్వాత సీఎం డీకే.శివకుమార్, ప్రియాంక్‌ఖర్గే కూడా హైకమాండ్‌ను కలిసి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయుధ పూజలో
గాల్లోకి కాల్పులు
● బీజేపీ నేతపై సుమోటో కేసు నమోదు
దొడ్డబళ్లాపురం: ఆయుధ పూజ సమయంలో బీజేపీ నేత గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన చిక్కమగళూరులోని కోట కాలనీలో చోటు చేసుకుంది. జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు జీవన్ ఆయుధపూజ రోజున ఇంటి వద్ద డబుల్ బ్యారెల్ గన్, రివాల్వర్‌తో మొత్తం 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు.
రాత్రంతా ఆదమరిచి..
దిండు పైనే నిద్రించి..
● అన్నాచెల్లెలికి త్రుటిలో తప్పిన
ప్రాణాపాయం
దొడ్డబళ్లాపురం: దిండు కింద నాగుపాము ఉన్న సంగతి కూడా తెలియని అన్నాచెల్లెలు ఇద్దరూ రాత్రంతా అదే దిండు మీద పడుకున్న సంఘటన బాగలగుంటెలోని భైరవేశ్వర నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న కుటుంబం రాత్రి పడుకునే ముందు కిటికీ తీసి పడుకున్నారు. కిటికీలోంచి లోపలకు వచ్చిన నాగుపాము ఒకటి ఇల్లంతా తిరిగి చివరకు బెడ్‌రూంలో అన్నాచెల్లెలు పడుకున్న దిండు కిందకు చేరి తోక ముడుచుకుని పడుకుంది. అన్నాచెల్లెలు ఇద్దరికీ రాత్రి రెండు మూడు సార్లు ఒంటిమీద ఏదో పాకినట్టు అనిపించిందని, అయితే మామూలుగా ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటాయి కాబట్టి ఎలుకలుగా భావించి అలాగే నిద్రపోయారు. ఉదయం నిద్రలేచి దిండు తీయగా కింద నాగుపాము తోక ముడుచుకుని సేద తీరుతోంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ నాగేంద్రకు ఫోన్ చేసారు. తక్షణం అక్కడకు వచ్చిన నాగేంద్ర పాముని సురక్షితంగా పట్టుకున్నాడు.
సీఎంతో
పోలాండ్ ప్రధాని భేటీ
యశవంతపుర: వచ్చే ఏడాది బెంగళూరులో జరిగే పెట్టుబడిదారుల సమావేశానికి తమ దేశం తరపున భాగస్వామిగా పాల్గొనాలని పోలాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. శుక్రవారం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బెంగళూరులో పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ కలిశారు. సాంకేతిక పరిజ్ణానం, నావీణ్యత, వ్యాపారపరంగా కర్ణాటక గ్లోబల్ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరులో పోలాండ్ ప్రధానిని, ఆ దేశానికి చెందిన ప్రతినిధి బృందాన్ని స్వాగతించినట్లు సీఎం తెలిపారు.


