ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

బళ్లారిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన ఉపాధ్యాయులు

బళ్లారిలో ఓటరు జాబితాలో పేర్లు వెతుక్కుంటున్న దృశ్యం

సాక్షి, బళ్లారి/హొసపేటె/రాయచూరు రూరల్‌: కర్ణాటక శాసనమండలి ఈశాన్య ఉపాధ్యాయ నియోజవర్గానికి శుక్రవారం పోలింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగింది. ఈశాన్య ఉపాధ్యాయ నియోజవర్గానికి సంబంధించి కళ్యాణ కర్ణాటక పరిధిలో ఉన్న కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్‌, బళ్లారి, విజయనగర జిల్లాల్లో ఉపాధ్యాయులు తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ జిల్లాల పరిధిలో 34,784 ఓటర్లు ఉండగా.. దాదాపు 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. బళ్లారి జిల్లా వ్యాప్తంగా 9 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పోలింగ్‌ ముసిగే సరికి 86.50 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని జిల్లాల్లో ఆయా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున శశీల్‌ నమోషీ, కాంగ్రెస్‌ పార్టీ తరఫున శరణప్ప మట్టూరు బరిలో నిలిచారు. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో మొత్తం 13 మంది పోటీ చేశారు. నెల రోజులకు పైగా ఎన్నికల ప్రచారంలో మునిగిన అభ్యర్థులు ప్రశాంతంగా పోలింగ్‌ ముగియడంతో ఊపిరిపీల్చుకున్నారు. బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. ఇక రాయచూరులో విధాన పరిషత్‌ సభ్యులు వసంత కుమార్‌, బోసురాజు, శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్‌, దేవదుర్గలో శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. రాయచూరులో జిల్లా అధికారిణి పూవిత పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయించారు.

విజయనగర జిల్లాలో 18 పోలింగ్‌ కేంద్రాలు

కర్ణాటక శాసనమండలి ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు విజయనగర జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అవసరమైన ఎన్నికల సిబ్బందిని నియమించి ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈసారి ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయనగర జిల్లాలో మొత్తం 3,326 మంది ఓటర్లు ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,190 మంది పురుషులు, 1,136 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

60 శాతం పోలింగ్‌ నమోదు..

కర్ణాటక శాసనమండలి

ఈశాన్య ఉపాధ్యాయ,

పశ్చిమ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలకు ప్రశాంతంగా పోలింగ్‌

ఉత్సాహంగా ఓటు వేసిన

ఉపాధ్యాయులు, పట్టభద్రులు

పటిష్ట బందోబస్తు చేపట్టిన పోలీసులు

బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన

అభ్యర్థుల భవితవ్యం

ఈనెల 27న ఓట్ల లెక్కింపు

హుబ్లీ: జంట నగరాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం కర్ణాటక శాసనమండలి పశ్చిమ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం ఎన్నికలు జరిగాయి. ధార్వాడ జిల్లాలో మొత్తం 35,119 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా.. సుమారు 60 శాతం వరకు పోలింగ్‌ జరిగిందని అధికారులు తెలిపారు. కర్ణాటక ఆర్ట్స్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో జిల్లా అధికారి స్నేహల్‌ ఓటు వేశారు. స్థానిక బసవేశ్వర నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి మోహన్‌ లింబేకాయి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల ట్రెడ్‌ బాగా ఉంది. సానుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ధార్వాడ బాసెల్‌ మిషన్‌ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ నేత దీపక్‌ చించొరే పోలింగ్‌ సిబ్బందితో వాదులాటకు దిగారు. కాంగ్రెస్‌ ఓటర్ల జాబితాను ఏజెంట్లకు ఇవ్వడానికి పోలింగ్‌ కేంద్రం లోపలికి అనుమతించలేదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement