నాపై కుట్రతోనే స్టింగ్‌ ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నాపై కుట్రతోనే స్టింగ్‌ ఆపరేషన్‌

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

మైసూరు: నాపై కుట్రలో భాగంగానే స్టింగ్‌ ఆపరేషన్‌ జరిగిందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. శుక్రవారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. అది ఒక బూటకపు కేసు. బ్లాక్‌మెయిల్‌ కోసం చేసిన పని. దీని వెనుక ఎవరున్నారో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఈ బూటకపు కేసు ముమ్మరంగా ప్రచారం కాకుండా ఉండేందుకు నేను సివిల్‌ కోర్టుకు వెళ్లి స్టే తెప్పించానని ఆయన అన్నారు.

స్టింగ్‌లో ఉన్నది మా వాళ్లే –మంత్రి యతీంద్ర

మా నాన్న, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరును అప్రతిష్టపాలు చేయడానికి ఈ స్టింగ్‌ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. పుత్తూరు టికెట్‌ ఆశిస్తున్న ఒక మహిళ ఈ కేసులో ఉంది. ఆ మహిళ మా పార్టీకి చెందినవారే. ఆమెను స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నించారు అని మైసూరు జిల్లా ఇన్‌చార్జి, పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్‌ యతీంద్ర సిద్దరామయ్య అన్నారు. శుక్రవారం మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో మా పార్టీ సభ్యులే ఉన్నారన్నారు. మా నాన్న కీర్తిని, వారసత్వాన్ని మసకబార్చి, ఆయనను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నం జరిగిందని అన్నారు.

స్టింగ్‌ ఆపరేషన్‌లో కుమ్మకై ్కతే చర్యలు

● కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌

దొడ్డబళ్లాపురం: స్టింగ్‌ ఆపరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ వారు కుమ్మకై ్కనట్లు తేలితే వారికి నోటీసులిచ్చి తగిన చర్యలు తీసుకుంటామని కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కేపీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కోలేని పిరికిపందలే ఇలాంటి నీచాలు చేస్తారన్నారు. వీడియోలో ఎవరున్నారు? వారి వెనుక ఎవరున్నారు? అనే విషయాలు బయటపడతాయన్నారు. అవసరమైతే దర్యాప్తు చేయిస్తామన్నారు.

స్టింగ్‌పై కూపీ లాగిన హైకమాండ్‌

బనశంకరి: రాష్ట్రంలో స్టింగ్‌ ఆపరేషన్‌ అంశం తీవ్రమవుతున్న నేపథ్యంలో హైకమాండ్‌ రంగప్రవేశం చేసింది. గురువారం ఢిల్లీలో సీఎం డీకే శివకుమార్‌, హోం మంత్రి ప్రియాంక్‌ ఖర్గేతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన హైకమాండ్‌ నేతలు సమాచారం సేకరించారు. అంతేగాక ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

స్టింగ్‌పై చర్యలకు రంగం సిద్ధం

శివాజీనగర: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ జరిగిందన్న ఆరోపణలపై కేపీసీసీ మహిళా నాయకురాలికి నోటీసు జారీ చేయడానికి పార్టీ సిద్ధమవుతోంది. ఈ ఆరోపణలపై పార్టీ వివరణ కోరుతోంది. రెండు వారాల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియో ప్రసారంపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement