మద్దతు ధర కోసం రైతన్నల కదం | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర కోసం రైతన్నల కదం

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకాలోని గణంగూరు టోల్‌ ప్లాజా వద్ద వందలాది మంది రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించి, చెరకుకు మద్దతు ధర, రైతు రుణమాఫీతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ఒత్తిడి చేస్తూ నిరసన చేపట్టారు. మేలుకోటె ఎమ్మెల్యే, రైతు నాయకుడు దర్శన్‌ పుట్టణ్ణయ్య నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసనలో, రైతు సంఘాలతో పాటు వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపి బెంగళూరు–మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. టన్ను చెరకుకు కనీస ధర రూ.5,500గా నిర్ణయించాలని, ప్రతి చక్కెర కర్మాగార యజమానులు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గట్టి పోలీసు బందోబస్తు

నిరసన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఐజీపీ బోరలింగయ్య, జిల్లా ఎస్పీ డాక్టర్‌ శోభారాణి నాయకత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. నిరసనకారులు సర్వీస్‌ రోడ్డును, హైవేను పూర్తిగా దిగ్బంధించి తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ రోడ్డుపైనే కూర్చుండిపోయారు. దీంతో రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది:

ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌.చెలువరాయ స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి వైఖరితో రైతుల సమస్యలు సంక్లిష్టంగా మారుతున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. మంత్రి హామీతో ఎట్టకేలకు రైతులు నిరసన విరమించుకున్నారు. ఎమ్మెల్యే దర్శన్‌ పుట్టణ్ణయ్య, సీఈఎస్‌సీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమేష్‌ బండిసిద్దే గౌడ, జిల్లాధికారి డాక్టర్‌ కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జాతీయ రహదారి దిగ్బంధించిన రైతులు

మంత్రి హామీతో ఆందోళన విరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement