హొసపేటె: మైసూరు దసరా ఉత్సవాల్లో దళిత మంత్రులను వేదికపై వెళ్లకుండా అడ్డుకుని అవమానించిన ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని దళిత అనుకూల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హొసపేటెలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. హొసపేటెలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు.. డాక్టర్.పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మంత్రికి జరిగిన అవమానంపై ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఐపీఎస్ అధికారిపై తీసుకున్న చర్యల విషయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బసవరాజ్‌కు
సూర్యకీర్తి పురస్కారం
బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లా కర్ణాటక ఇతిహాస అకాడమీ అధ్యక్షుడు టీహెచ్‌ఎం బసవరాజ్‌కు సూర్యకీర్తి పురస్కారం లభించింది. బీదర్ జిల్లా బల్కిలో కర్ణాటక ఇతిహస అకాడమీ 40వ జాతీయ సదస్సు జరిగింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రే చేతుల మీదుగా బసవరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రూ.10 వేల నగదు బహుమతితో పాటు స్మారక పుస్తకాన్ని అందజేశారు. కార్యక్రమంలో బల్కీ హిరేమఠ సంస్థాన్‌కు చెందిన పూజ్య బసవలింగ పట్టదేవరు, పూజ్య గురుబసవ పట్టదేవరు, ఇతిహాస అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.దేవరకొండ రెడ్డి, సదస్సు ప్రధానార్చకులు డాక్టర్ కే.రవీంద్రనాథ్, హంపీ కన్నడ విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్. పీవీ.పరశివమూర్తి, డాక్టర్.కేఎల్ అకాడమీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎఫ్.ఏ.టీ హశిల్లాంటి, సంధ్యా ధన్‌పాల్, విద్యాపీఠం మేనేజర్ మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ తెల్గవి తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో
ఆరోగ్య పరీక్షలు
రాయచూరు రూరల్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పరీక్షలు చేయవచ్చని బెళగావి ఐఐటీ డీన్ మనీష్ బరవాలీయ తెలిపారు. ఆహరం, విద్య, పరిసరాల సంరక్షణలో భాగంగా రాయచూరులోని భారతీయ సమాచార సాంకేతిక రంగ సంస్థలతో (ఐఐఐటీ) నవోదయ వైద్య కళాశాల ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూలు చేసుకుని సంతకాలు చేశారు. కార్యక్రమంలో నవోదయ వైద్య కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్, రామ్‌మోహన్ గుప్తా, సురేష్ బాబు, గురుదత్త పవార్, అమృత రెడ్డి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


