అధికారం కోసం ఏమైనా చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

అధికారం కోసం ఏమైనా చేస్తారా?

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

హుబ్లీ: అధికారం కోసం ఏమైనా చేస్తారా? అని కాంగ్రెస్‌ నాయకులపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా శుక్రవారం స్థానిక ఫాతీమా హైస్కూల్‌లో పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దు విషయంలో ఎవరున్నారన్నది కాంగ్రెస్‌ హైకమాండ్‌ బహిరంగ పరచాలని డిమాండ్‌ చేశారు. రైతులకు కరువు పరిహారం అందజేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందని తెలిపారు. గత బీజేపీ హయంలో యడియూరప్ప, బసవరాజ్‌ బొమ్మై రైతులకు ప్రతి హెక్టార్‌కు రూ.13 వేల పరిహారం చెల్లించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కనిష్టంగా రూ.2500 ఇవ్వడానికి కూడా డీకే.శివకుమార్‌ ప్రభుత్వం డబ్బులు లేవని చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసిందని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు పోలీస్‌ అనుమతి తప్పనిసరి అని హోం మంత్రి ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ తనదైన శైలిలో జవాబు చెబుతుందన్నారు. ఈనెల 26న బెంగళూరులో సీఎం సమావేశం నిర్ణయించారని.. పార్లమెంట్‌ సమావేశం, ఇతర కార్యక్రమాల వల్ల తాను పాల్గొనడానికి సాధ్యం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement