చెరకు రైతన్నల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

చెరకు రైతన్నల పోరుబాట

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

బనశంకరి: చెరకు మద్దతు ధర పెంపు సహా వివిధ డిమాండ్లు పరిష్కరించాలని చెరకు రైతులు చేపట్టిన హైవేలపై నిరసన మూడో రోజుకు చేరింది. చక్కెర ధరను పెంచాలి, రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. హుబ్లీ–ధార్వాడలో రైతులు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. బెళగావి, హుబ్లీ–ధార్వాడ, బాగల్‌కోటే, హావేరి, గదగ్‌, కలబుర్గి, రాయచూరు తో పాటు వివిధ జిల్లాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. బెళగావి, హత్తరగి, హిరేబాగవాడి, తో పాటు మూడుచోట్ల మహారాష్ట్రను కలిపే హైవేలను దిగ్బంధించడంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. భారీసంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు.

సంచారం అస్తవ్యస్తం

ఎక్కడికక్కడ హైవేలు, రహదారులపై ఆందోళనలకు దిగడంతో సంచార వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ట్రాక్టర్లు, ఎద్దులబండ్లు, పశువులను అడ్డుగా నిలిపారు. పలువురు స్వామీజీలు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి తక్షణం రాజీనామా చేయాలన్నారు. ఇంతవరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై వంట చేసి ఆరగించి గురువారం రాత్రి రోడ్లపైనే నిద్రపోయారు. కొన్నిచోట్ల గ్రామాల ప్రజలు రైతులకు నిత్యావసరాలను అందజేశారు.

3వ రోజూ అదే జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement